Pages

Saturday, July 27, 2013

Attarintiki Daredi Song Lyrics in Telugu



Aaradugula Bullettu


ఆరడుగుల బుల్లెట్టు


గగనపువీధి వీడి వలసవెళ్ళి పోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకుతానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమే తనవాసం వనవాసం

భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో
ఉక్కుతీగ లాంటి ఒంటి నైజం
వీడు మెరుపులన్నీ ఒక్కటైన తేజం
రక్షకుడో తక్షకుడో పరీక్షలకే సుశిక్షితుడో
శత్రువంటూ లేని వింత యుధ్ధం
ఇది గుండె లోతు గాయమైన శబ్దం
నడిచొచ్చే నర్తనశౌరీ పరిగెత్తే పరాక్రమశైలీ
హలాహలం హరించిన ఖడ్గత్‌హృదయుడో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

గగనపువీధి వీడి వలసవెళ్ళి పోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకుతానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమే తనవాసం వనవాసం

దివి నుంచి భువి పైకి భగభగమని కురిసేటి
వినిపించని కిరణం చప్పుడు వీడు
వడివడిగా వడగళ్ళై దడదడమని జారేటి
కనిపించని జడివానేగా వీడు
శంఖంలో దాగేటి పోటెత్తిన సంద్రం హోరితడు
శోకాన్నే దాటేసే అశోకుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

తన మొదలే వదులుకుని పైకెదిగిన కొమ్మలకి
చిగురించిన చోటుని చూపిస్తాడు
తన దిశనే మార్చుకుని ప్రభవించే సూర్యుడికి
తన తూరుపు పరిచయమే చేస్తాడు
రావణుడో రాఘవుడొ మనసుని దోచే మానవుడో
సైనికుడో శ్రామికుడో అసాధ్యుడు వీడురో
వీడు ఆరడుగుల బుల్లెట్టు
వీడు ధైర్యం విసిరిన రాకెట్టు

గగనపువీధి వీడి వలసవెళ్ళి పోయిన నీలి మబ్బు కోసం
తరలింది తనకుతానే ఆకాశం పరదేశం
శిఖరపు అంచు నుంచి నేల జారిపోయిన నీటి చుక్క కోసం
విడిచింది చూడు నగమే తనవాసం వనవాసం

Ninnu Chudagane

నిన్ను చూడగానే


నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే

నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే
ఏమిటో ఏమాయో చేసినావే కంటిచూపుతోటి
ఏమిటో ఇదేమిరోగమో అంటించినావే వంటివూపుతోటి
ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా

నిన్ను చూడగానే నా చిట్టిగుండె
నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే

అంతపెద్ద ఆకాశం అంతులేని ఆ నీలం నీ చేపకళ్ళ లోతుల్లో
ఎట్టా నింపావే ఇరగదీసావే
భూమిలోన బంగారం దాగి ఉందనేది ఓ సత్యం
దాన్ని నువ్వు భూమిపైన పెరెగేస్తూ ఇట్టా తిరగేస్తూ తిరగరాసావే
ఏ అలా నువ్వు చీర కట్టి చిందులేస్తే చీమలా నేను వెంటపడనా
నావలా నువ్వు తూగుతు నడుస్తూవుంటే కాపలాకి నేను వెంటరానా
కృష్ణ రాధలా నొప్పి బాధలా ఉందాంరావే మరదలా
నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే

ఆహుం ఆహుం ఆహుం ఆహుం
అత్త లేని కోడలు ఉత్తమురాలు ఓరమ్మా
కొడలేలేని అత్త గుణవంతురాలు ఆహుం ఆహుం
ఓయ్ కోడలా కోడలా కొడుకు పెళ్ళామా ఓరమ్మా
పచ్చి పాలమీద మీగడేదమ్మా
వేడి పాలలోన వెన్న ఏదమ్మా

మోనాలిసా చిత్రాన్ని గీసినోడు ఎవడైనా
ఈ పాలసీసా అందాన్ని చూడనేలేదు ఇంక ఏంలాభం
కోహినూరు వజ్రాన్ని ఎత్తికెళ్ళినోడు రాజైనా
దాని మెరుపు నీలోని దాగి ఉందని తెలియలేపాపం
ఇంతిలా నువ్వు పుట్టుకొస్తే నేనుమాత్రం ఎంతనీ పొగిడి పాడగలనూ
తెలుగు భాషలో నాకు తెలిసిన పదాలు అన్ని గుమ్మరించి ఇంత రాసినాను
సిరివెన్నల మూటలా వేటూరి పాటలా ముద్దుగున్నావే మరదలా

నిన్ను చూడగానే నా చిట్టిగుండె
నిన్ను చూడగానే చిట్టిగుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే
నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవే అదేమిటే

Baapu Gari Bomma

బాపు గారి బొమ్మో

ఏయ్ బొంగరలాంటి కళ్ళు తిప్పింది
ఉంగరాల్లున్న జుట్టు తిప్పింది
గింగిరాలెత్తే నడుమొంపుల్లో నన్నే తిప్పిందీ
అమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లిపూల కొమ్మో

రబ్బరు గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నెగరేసిందీ
అమ్మో దాని చూపు గమ్మో
ఓలమ్మో ఓల్డ్ మాంక్ రమ్మో

పగడాల పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా
కత్తులులేని యుద్దం చేసి నన్నే గెలిచిందీ
ఏకంగా ఎదపైనే నర్తించిందీ అబ్బా
నాట్యంలోని ముద్దర చూసి నిద్దరరాదే పోయింది
అమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లిపూల కొమ్మో

మొన్న మేడమీద బట్టలారేస్తూ కూనిరాగమేదో తీసేస్తూ
పిడుకెడు ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా
నిన్న కాఫిగ్లాసు చేతికందిస్తూ నాజూకైన వేల్లు తాకిస్తూ
మెత్తని మత్తుల విద్యుతీగై ఒత్తిడి పెంచిందే మల్లా హాయ్
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నా వైపే అనిపిస్తుందీ
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసిందీ
చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది
పొద్దుపొద్దున్నే హల్లో అంటుంది
పొద్దుపోతేచాలు కల్లోకొస్తూందీ
పొద్దస్తమానం పోయినంతదూరం గుర్తొస్తుంటుందీ
అమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లిపూల కొమ్మో

ఏ మాయాలోకంలోనో నన్ను మెల్లగ తొసేసింది
తలుపులు మూసింది తాళం పోగొట్టేసిందీ
ఆ మబ్బుల అంచులదాకా నామనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చెన పక్కకు లాగిందీ
తిన్నగా గుండెనుపట్టి గుప్పెట పెట్టి మూసేసిందీ
అందమే గంధపుగాలై మళ్ళీ ఊపిరి పోసింది
తియ్యని ముచ్చటలెన్నో ఆలోచనలో అచ్చేసింది
ప్రేమనే కళ్ళద్దాలు చూపులకే తగిలించిందీ
కోశలదేశపు రాజకుమరి ఆశలురేపిన అందాల పోరి
పూసల దండలు నన్నే గుచ్చీ మెల్లొ వేసిందీ

అమ్మో బాపు గారి బొమ్మో
ఓలమ్మో మల్లిపూల కొమ్మో

No comments:

Post a Comment